: శ్రీలంకలోని అశోక వనాన్ని సందర్శించిన భారత క్రికెటర్లు
సీతను రావణుడు అపహరించి దాచిన అశోకవాటికను భారత క్రికెటర్లు కుటుంబ సమేతంగా సందర్శించారు. శ్రీలంకతో చివరి టెస్ట్ మ్యాచ్ శనివారం జరగనుండటంతో మధ్యలో దొరికిన ఖాళీ సమయాన్ని వారు అశోక వనం సందర్శనకు కేటాయించారు. తాము సీతను బంధించిన స్థలాన్ని సందర్శించినట్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌లు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. తామంతా కలిసి దిగిన ఫొటోలను వారు షేర్ చేశారు. ఈ ఫొటోల్లో కుల్‌దీప్ యాదవ్, వృద్ధిమాన్ సాహ, ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్‌లను చూడొచ్చు. కెప్టెన్ విరాట్ కోహ్లీ వీళ్లతో పాటు రాలేదని స్పష్టమవుతోంది. ఇప్పటికే శ్రీలంకతో ఆడిన రెండు టెస్టుల్లోనూ భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.