: సల్మాన్, షారుక్‌ల వల్ల రూ. 60 కోట్లు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్!
నరేంద్ర హిరావత్, ముంబైకి చెందిన ఎన్‌హెచ్ స్టూడియోస్ యజమాని. చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా పనిచేశాడు. అటువంటి ఆయన తాజాగా భారీ మొత్తంలో నష్టపోయాడు. సల్మాన్ ఖాన్ నటించిన `ట్యూబ్‌లైట్`, షారుక్ నటించిన `జబ్ హ్యారీ మెట్ సెజల్` సినిమాలను ఇటీవల నరేంద్ర డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ రెండు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో రూ. 60 కోట్ల వరకు నష్టపోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంత మొత్తంలో తాను ఎప్పుడూ నష్టపోలేదని మీడియాతో అన్నారు.
`ట్యూబ్‌లైట్` సినిమా సరైన కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన సొమ్మును సల్మాన్ తిరిగి చెల్లిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. షారుక్ ఖాన్ కూడా ఇదే బాటలో డిస్ట్రిబ్యూటర్‌లు నష్టపోయిన డబ్బును చెల్లిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.