: చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది?: రోజా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాల్చేయాలని, ఉరితీసినా తప్పులేదని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎమ్మెల్యే రోజా ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమందని, అప్పట్లో సీమ గూండాలు అంటూ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఎందుకు క్షమాపణ చెప్పలేదని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్నివర్గాలను మోసం చేశారని రోజా ఆరోపించారు. అలాంటి చంద్రబాబును ఏం చేయాలో టీడీపీ నేతలే చెప్పాలని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతో టీడీపీ నేతలే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమ మొత్తానికి అన్యాయం చేసిందని అన్నారు.