: ట్రంప్ వ్యాఖ్యలతో పెరిగిన ఆయుధాల కొనుగోళ్లు... గూఢార్థం అదే అంటున్న నిపుణులు
ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన `యుద్ధానికి సిద్ధం` అనే వ్యాఖ్యలు చర్చనీయాంశమైనాయి. ఈ వ్యాఖ్యల కారణంగా అమెరికా ఆయుధ తయారీ కంపెనీల లాభాలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా మిత్ర దేశాలన్నీ యుద్ధం వస్తుందేమోనని ఆయుధాల కొనుగోళ్లను ముమ్మరం చేయడంతో ఈ పెరుగుదల సంభవించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇలా ఆయుధాల కొనుగోళ్లు పెరిగి, అమెరికా కంపెనీలకు లాభాలు రావడం కోసమే ట్రంప్ అలాంటి వ్యాఖ్యలు చేసుంటారని రాజకీయవేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటిలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఒక్కసారిగా వస్తున్న లాభాలను చూసుకుని అమెరికా ఆయుధ కంపెనీలు ఆనందపడుతున్నాయి. గతంలో సిరియాలో క్షిపణుల దాడికి ముందు కూడా ఆయుధాల అమ్మకాలు పెరిగాయని కంపెనీలు తెలియజేశాయి.