: రూ.33,000 ఖర్చు పెట్టి అమెజాన్‌లో టీవీ ఆర్డర్ చేస్తే.. పాత మానిటర్ వచ్చిన వైనం!
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ఓ వ్యక్తి రూ.33,000 ఖర్చు పెట్టి 50 అంగుళాల టీవీ ఆర్డర్ చేస్తే దానికి బదులుగా 13 అంగుళాల పాత ఏసర్ మానిటర్ వచ్చింది. దీంతో తన డబ్బు తనకు ఇవ్వాలంటూ సదరు వ్యక్తి మూడునెలలుగా పోరాడుతున్నాడు. అయినప్పటికీ అమెజాన్ నుంచి స్పందన రాకపోవడంతో తాజాగా ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ముంబయిలోని ఓ ఐటీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తోన్న మహ్మద్ సర్వార్ అనే వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది.
ఈ ఏడాది మేలో తాను అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు వస్తోన్న 50 అంగుళాల మితాషి ఎల్‌ఈడీ టీవీని ఆర్డరు చేశానని, మే 19న ప్యాకేజ్‌ను అందుకున్న తాను దాన్ని తెరచిచూడగా అందులో ఇలా పాత ఏసర్ మానిటర్ కనిపించిందని బాధితుడు చెప్పాడు.