: ఈ చిత్రంలో పాము ఎక్కడుందో చెబితే... మంచి పరిశీలనా శక్తి ఉన్నట్టేనట!
ఏదైనా ఓ ఫోటో చూపించి, అందులో ఫలానా వస్తువు లేదా జంతువు ఎక్కడుందో కనిపెట్టాలన్న పజిల్స్ ఎన్నో వచ్చాయి. కానీ, ఇది ఇంకాస్త క్లిష్టమైనది. పైనున్న ఫోటో చూశారుగా?... అందులో ఓ పాము దాగుంది. అమెరికాలోని టెక్సాస్ నుంచి 'బిగ్ కంట్రీ స్నేక్ రిమూవల్' అనే ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఫోటో పోస్టు అయింది. ఈ చిత్రంలో దాగున్న ఓ పామును కనిపెట్టడమే టార్గెట్. తొలి చిత్రాన్ని చూసి పామును కనిపెడితే, అమితమైన పరిశీలనా శక్తి ఉన్నట్టేనని చెబుతుండటంతో ఇది చాలా స్పీడ్ గా వైరల్ అయింది. ఇక మీరూ ట్రై చేయండి. క్లూ ఏంటంటే ఓ కాపర్ హెడ్ స్నేక్, చెట్ల ఆకుల మధ్య కలసిపోయి ఉంది.
పాము కనిపించలేదా?... కొంచెం కిందకు స్క్రోల్ చేసి జూమ్ చేసిన ఫోటోలు చూడండి.
ఇంకా కనిపించలేదా? కింద ఉన్న ఫోటోలో మధ్యలో చూడండి!