: అమ్మానాన్నలే దహన సంస్కారాలు చేయాలి...గుడ్ బై మిస్టర్ శాడిస్ట్...: భర్తకు సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న వివాహిత


తన శవాన్ని అత్తింటివారు ముట్టుకోవద్దని, తన తల్లిదండ్రులే అంతిమ సంస్కారం చేయాలని చెబుతూ, భర్తకు గుడ్ బై శాడిస్ట్ అని చెప్పి తనువు చాలించిందో వివాహిత. ఆ వివరాల్లోకి వెళ్తే....ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని వికలాంగులశాఖ విభాగంలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న రేమల్లె మురళీకృష్ణ భార్య కృష్ణవేణి (34) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విధుల నిమిత్తం మురళీకృష్ణ ఖమ్మం వెళ్లగా, వారి కుమార్తె (8) స్కూల్‌ కు వెళ్లింది. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన బాలిక తలుపులు ఎంతసేపు కొడుతున్నా తీయకపోవడంతో దగ్గర్లోనే నివాసం ఉంటున్న కృష్ణవేణికి వరుసకు తమ్ముడైన కిరణ్‌ ను పిలిచింది. దీంతో ఆయన కిటికీలోంచి చూడగా, ఉరివేసుకుని కనిపించింది.

 దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వచ్చి తలుపుపగులగొట్టి ఆమెను కిందికి దించి, ఆమె రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కుమార్తె పేరుతో ఆమె రాసిన సుదీర్ఘ లేఖలో తన భర్త శాడిస్టు వ్యవహారాన్ని వివరంగా పేర్కొంది. కూతురునుద్దేశించి చెబుతూ, "బంగారు తల్లీ, నీకు అన్యాయం చేసి చనిపోతున్నా, నన్ను ఎవరూ చంపలేదు. నేనే చనిపోతున్నాను. ఏడవద్దు, ఎవరినీ ఏడిపించవద్దు" అని రాసింది. తన శవాన్ని అత్తింటివారు కనీసం తాకకూడదని, అంతిమ సంస్కారాలన్నీ తన తల్లిదండ్రులే చేయాలని, అదే తన చివరి కోరిక అని లేఖలో రాసింది. ఆ తరువాత 'మిస్టర్ శాడిస్ట్ గుడ్ బై' అంటూ భర్తను సంబోధిస్తూ లేఖ రాసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కుటుంబ కలహాలపై కిరణ్, ఆమె తల్లిదండ్రులు, అత్తమామలను విచారిస్తున్నారు. 

  • Loading...

More Telugu News