: తిండి, జీతం లేకుండా ఒమన్‌లో చిక్కుకుపోయిన 800 మంది భారతీయులు
ఓ కంపెనీ యజమానుల బాధ్యతారాహిత్యం వల్ల 800 మందికి పైగా భారతీయులు తిండి, జీతం లేకుండా ఒమన్ దేశంలో చిక్కుకు పోయారు. దురదృష్టవశాత్తు ఈ కంపెనీ యజమానులు కూడా భారతీయులే కావడంతో సమస్య మరింత జటిలంగా మారింది. తమ ఉద్యోగుల వర్క్ పర్మిట్ కార్డులను సరైన సమయంలో రెన్యూవల్ చేయకపోవడం వల్లనే వారికి ఈ పరిస్థితి వచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
వీరికి భారతీయ దౌత్య కేంద్రం సహాయం చేసినా, ఆ సహాయం ఎన్ని రోజుల వరకు ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగం వదిలి రాలేక, భవిష్యత్తుపై స్పష్టత లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. వీరికి భారత దౌత్య కేంద్రం మూడు ఆప్షన్లు ఇచ్చింది. భారత్‌కి తిరిగి రావడం, ఒమన్‌లోనే వేరే ఉద్యోగం చేసుకోవడం, సొంత ఖర్చులతో జీవితాన్ని గడపడం వంటి అవకాశాలు కల్పించింది. వీటిలో ఏ ఒక్కటి ఎంచుకున్నా సౌదీ కంపెనీ నియమాల ప్రకారం ఇంతకాలం వారు పనిచేసిన దానికి ఎలాంటి జీతం లభించదని ఉద్యోగులు వాపోతున్నారు.