: అవన్నీ మైండ్ గేమ్ లే అంటోన్న టీడీపీ నేత
కనీవినీ ఎరుగని రీతిలో అవినీతికి పాల్పడి కూడా జైల్లోంచి విచారణ కోసం బయటికొచ్చే సమయంలో జగన్ నవ్వుతూ ఉండడం వెనుక మైండ్ గేమ్ దాగి ఉందని టీడీపీ నేత వర్ల రామయ్య అంటున్నారు. తానేమీ తప్పుచేయలేదన్న భావన చూసేవాళ్ళలో కలగాలనే జగన్ జైలు గేటు వెలుపల కనిపించిన వారందరికీ నవ్వుతూ నమస్కారాలు పెడుతుంటాడని వర్ల వివరించారు. ఇక ఆయన భార్య వైఎస్ భారతి కూడా మైండ్ గేమ్ కు పాల్పడుతోందని వర్ల ఆరోపించారు.
కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ అధికారితో 'నీకు పిల్లల్లేరా?' అని శాపనార్థరాలు పెట్టడం వెనుక వారి దర్యాప్తును ప్రభావితం చేయాలన్న దూరాలోచన దాగి ఉందని వర్ల చెప్పారు. జగన్ గత చరిత్ర దృష్ట్యా సీబీఐ అధికారులకు రక్షణ కల్పించాలని వర్ల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్యాక్షన్ మూలాల నుంచి వచ్చిన జగన్ కు ప్రాణాలు తీయడం చాలా తేలికని వర్ల అన్నారు.