: దివ్యాంగుల కోసం చిహ్నభాషలో జాతీయగీతం... వీడియో చూడండి
దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా చిహ్నభాషలో జాతీయగీతం వీడియోను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వీడియోను కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఆవిష్కరించారు. `భారత జాతీయ గీతాన్ని చిహ్నభాషలో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ప్రధాని మోదీ సూచన మేరకు ఈ వీడియోలో `వికలాంగులు` అని కాకుండా `దివ్యాంగులు` అని సంబోధించాం` అని మహేంద్రనాథ్ తెలిపారు. 3 నిమిషాల 35 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో పాటు వివిధ అంగవైకల్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలు ఉన్నారు. వారంతా కలిసి ఎర్రకోట ముందు జాతీయగీతాన్ని చిహ్నభాషలో ఆలపిస్తున్నట్లుగా ఈ వీడియోలో చూపించారు. దీనికి గోవింద్ నిహాలని దర్శకత్వం వహించారు.