: షారూఖ్ సినిమాలో అమితాబ్, రజనీకాంత్, ప్రభాస్?


బాలీవుడ్ బాద్షా షారుక్‌ ఖాన్‌ ఒకేసారి మూడు భాషల్లోని స్టార్ హీరోలతో సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. రెడ్ ఛిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ సినిమా పతాకంపై షారూఖ్ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటించే సినిమాల నిర్మాణంలో కూడా ఈ సంస్థ భాగస్వామ్యం అవుతుంది. తాజాగా ఆయన నటించిన 'జబ్ హ్యారీ మెట్ సెజెల్' సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఘోరపరాజయాన్ని పక్కనబెట్టి కబీర్ ఖాన్ తో తరువాతి సినిమా కోసం ప్రణాళికలు రచిస్తున్నాడు. హిందీ, తెలుగు, తమిళ సినీ పరిశ్రమలపై ఈ సినిమాతో కన్నేశాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షాతో పాటు దిగ్గజ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను నటింపజేయనున్నట్టు బీటౌన్ చెబుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ కాస్టింగ్ ఎంపిక ప్రారంభమైందని, షారూఖ్ కు జోడీగా దీపిక పదుకునేను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘శిద్యాత్‌’ అని పేరు పెట్టినట్టు సమాచారం. అయితే రొమాంటిక్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఈ ముగ్గురూ అతిథి పాత్రల్లో సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో వీరి పాత్రలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News