: `వాచ్` పేరుతో ఫేస్‌బుక్ కొత్త ఫీచర్... యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్‌లకు దెబ్బ!
ఒరిజినల్ కార్యక్రమాలు, షోలను ప్రసారం చేయడానికి `వాచ్` పేరుతో ఫేస్‌బుక్ కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని వల్ల ఇప్పటికే ఒరిజినల్ కంటెంట్ ప్రసారం చేస్తున్న యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి వీడియో ఆన్ డిమాండ్ వెబ్‌సైట్లకు తీవ్ర నష్టం కలగనుంది. `వాచ్` సౌకర్యం ద్వారా రియాలిటీ, కామెడీ నుంచి లైవ్ క్రీడలను కూడా ఫేస్‌బుక్ ప్రసారం చేయనుంది. ఈ సౌకర్యం ద్వారా యూజర్ జాబితాలో ఉన్న స్నేహితులు చూసే కార్యక్రమాల గురించి తెలుసుకోవడమే కాక, యూజర్ చూడాలనుకుంటున్న కార్యక్రమాన్ని ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసే అవకాశం ఉందని ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. అలాగే కార్యక్రమం ప్రసారం అవుతున్నపుడు దాని గురించి అదే కార్యక్రమం చూస్తున్న వారితో చాట్ చేసే సదుపాయాన్ని కూడా కల్పించినట్లు ఆయన తెలిపారు.