: ప్రిన్స్ సీఎంగా చేస్తున్న చిత్రంలో సూపర్ స్టార్ కూడా నటిస్తున్నారు!


ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తుండగా, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'భరత్ అను నేను' చిత్రం గురించిన తాజా అప్ డేట్ ఆయన అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటించనున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు బాలనటుడిగా ఉన్నప్పుడు పలు చిత్రాల్లో కృష్ణ, మహేష్ లు కలసి నటించిన సంగతి తెలిసిందే. ఆపై మహేష్ హీరోగా మారిన తరువాత రాజకుమారుడు, వంశీ, టక్కరి దొంగ చిత్రాల్లో ఆయన కనిపించారు. ఆపై మహేష్ నటించిన ఏ చిత్రంలోనూ ఆయన స్వయంగా నటించలేదు. ఇక 18 సంవత్సరాల తరువాత ఈ తండ్రీ కొడుకులు కలసి నటిస్తున్నారన్న వార్త వెలువడటంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కృష్ణతో పాటు ఈ చిత్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల పాత్రల్లో పలువురు సీనియర్ నటులు నటిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News