: ప్రమాణ స్వీకారం తరువాత... 'మాట్లాడాలా?' అని అడిగిన వెంకయ్య... వద్దనడంతో సీట్లోకి!
కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వెంకయ్యనాయుడు మైకు ముందుకు వచ్చి, తాను ప్రసంగించాలా? అని అక్కడున్న అధికారులను అడగడంతో, వారు అక్కర్లేదని చెప్పడంతో, తనకు కేటాయించిన సీట్లో కూర్చునేందుకు ఆయన వెళ్లిపోయారు. ఓ తలపండిన రాజకీయ నాయకుడిగా వెంకయ్య, నిత్యమూ రాజకీయ ప్రసంగాలు చేసేందుకు అలవాటు పడిపోయిన సంగతి తెలిసిందే. అందువల్లే ప్రమాణం తరువాత బాధ్యతలు తీసుకుంటున్నట్టు సంతకం పెట్టిన తరువాత, కాసేపు మాట్లాడేందుకు ఆయన ముందుకు వచ్చారు.
అయితే, ప్రొటోకాల్ ప్రకారం ప్రమాణ స్వీకారాల తరువాత రాష్ట్రపతి ఆసీనులై ఉండగా, ప్రసంగాలకు అవకాశం లేదు. ఆపై జాతీయ గీతంతో ఈ కార్యక్రమం ముగిసింది. అంతకుముందు పార్లమెంట్ లోని దర్బారు హాల్ లో పలువురు బీజేపీ నేతలతో పాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వీఐపీల సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కామినేని శ్రీనివాస్, మాగంటి బాబు తదితరులు హాజరయ్యారు.