: హిందీలో ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడి ప్రమాణస్వీకారం!


దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా హిందీలో వెంకయ్య ప్రమాణస్వీకారం చేయడం గమనార్హం. వెంకయ్య ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ కురువృద్ధుడు అద్వాణీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ పార్టీల అధినేతలు హాజరయ్యారు.  

  • Loading...

More Telugu News