: టీమిండియా జెర్సీపై బీసీసీఐ లోగోలో మూడు నక్షత్రాలు ఎందుకో తెలుసా?
టీమిండియా జెర్సీని జాగ్రత్తగా గమనించారా? ఆది నుంచి స్కై బ్లూ కలర్ ను ధరించిన టీమిండియా ఆటగాళ్లు బ్లూ బాయ్స్ గాను, మెన్ ఇన్ బ్లూ గాను పేరు సంపాదించారు. అయితే తొలి నాళ్లలో ఎలాంటి యాడ్స్ లేకుండా జెర్సీలు ఉండేవి. నెమ్మదిగా దుస్తులపై స్పాన్సర్ల లోగోలు వచ్చిచేరాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వన్డే, టీ20ల్లో ధరించే డ్రెస్ పై కుడిచేతివైపు బీసీసీఐ లోగో ఉంటుంది గమనించారా? ఆ లోగోపైన మూడు నక్షత్రాలు ఉంటాయి.
ఈ మూడు నక్షత్రాలు మూడు ప్రపంచ కప్ లకు గుర్తుగా వాటిని అక్కడ పెట్టారు. ఈ సంప్రదాయం ఫుట్ బాల్ లో ఉటుంది. బ్రెజిల్, ఇటలీ సాకర్ జట్ల జెర్సీలపైనా ఇటువంటి నక్షత్రాల గుర్తులే ఉంటాయి. అవి ఆయా జట్లు సాధించిన విజయాలను చూపుతాయి. అయితే టీమిండియా జెర్సీపై ఉన్న నక్షత్రాలు కపిల్, ధోనీ సారథ్యంలో సాధించిన రెండు వన్డే ప్రపంచ కప్ లతో పాటు ధోనీ సారథ్యంలో సాధించిన టీ20 ప్రపంచ కప్ ట్రోఫీలకు చిహ్నాలు.