: వెంకయ్య ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్లడం లేదు... బాబు హాజరు!


ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లడం లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడు ఉన్నత పదవిని అలంకరించనుండడంతో తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున ఆయనతో అనుబంధం ఉన్నవారు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని అంతా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు, బీజేపీ అధికారంలో గల రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని అంతా భావించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పని చేసిన వెంకయ్యనాయుడుకు ఎంతో మందితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు కేసీఆర్ కూడా హాజరవుతారని వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమం అనంతరం జీఎస్టీ అమలుపై అభ్యంతరాలను కేసీఆర్ ప్రధాని మోదీతో మాట్లాడుతారని భావించారు. అయితే ఊహించని విధంగా కేసీఆర్ తన ఢిల్లీ టూర్ ను రద్దు చేసుకున్నారు. అయితే ప్రధాని, బాబు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. 

  • Loading...

More Telugu News