: కీచక తండ్రికి 12 వేల ఏళ్ల జైలు శిక్ష?


కీచక తండ్రికి మలేసియా న్యాయస్థానం 12,000 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... నిందితుడు తన భార్యతో విడిపోయి కుమార్తె (15)తో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో కన్నకూతురిపై కన్నేసిన ఆ కామాంధుడు ఆమెపై 600 సార్లకు పైగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని అరాచకాలు భరించలేకపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె చెప్పిన వివరాలు విన్న పోలీసులు షాక్ తిన్నారు. దీంతో అతనిపై 626 కేసులు నమోదు చేశారు. అనంతరం అతనిని గతనెల 26న అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులు చదివేందుకు న్యాయస్థానానికి రెండు రోజులు పట్టడం విశేషం. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. దీంతో తీర్పును న్యాయస్థానం వాయిదా వేసింది. అయితే ఈ కేసులో అతనికి 12 వేల ఏళ్లపాటు కఠిన కారాగార శిక్షపడే అవకాశం ఉందని న్యాయాధికారులు చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News