: మాదిగ విద్యార్థి సమాఖ్య పిలుపు.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు విద్యా సంస్థల బంద్!


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు విద్యాసంస్థల మూసివేతకు మాదిగ విద్యార్థి సమాఖ్య పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణ విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శుక్రవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన కేసీఆర్ పార్లమెంటులో మాత్రం ఈ విషయంపై టీఆర్ఎస్ ఎంపీలతో ఒక్క మాటా మాట్లాడించలేకపోయారని ఆ సంఘం అధ్యక్షుడు లింగస్వామి ఆరోపించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News