: ఇవాంకాతోపాటు మోదీ కూడా.. నవంబరులో హైదరాబాద్‌కు.. కేసీఆర్ ఖుషీ!
నవంబరు 28 నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా హాజరుకానున్నారు. భారత్, అమెరికా దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న ఈ సదస్సుకు మోదీ, ఇవాంకాలు హాజరు కానుండడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. సదస్సులో పాల్గొనేందుకు అమెరికా నుంచి వస్తున్న బృందానికి ఇవాంకా ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సదస్సుకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.