: నేరెళ్ల ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్.. ఎస్‌ఐ సస్పెన్షన్!
ఇసుక లారీలకు నిప్పు పెట్టిన ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లకు చెందిన కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని చావబాదారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వారిలో కొందరు ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనలో ఎస్‌ఐ రవీందర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. డీజీపీ అనురాగ్ శర్మకు నేరెళ్ల ఘటనపై కరీంనగర్ డీఐజీ రవివర్మ నుంచి నివేదిక అందింది. దీంతో బాధితులపై ఇటువంటి చర్యలు తీసుకోవడానికి కారకుడైన ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేశారు.