: తీజ్ వేడుకల్లో గొడవ.. రాళ్లు, కర్రలతో దాడి.. ఒకరి మృతి
నల్లగొండ జిల్లా నేరుడుగోమ్ము మండలం పడమటి తండాలో ఈ రోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలో నిర్వహిస్తోన్న తీజ్ వేడుకల్లో ఇరు వర్గాల మధ్య తలెత్తిన గొడవ దాడులు చేసుకునే వరకు వెళ్లి ఒకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘర్షణలో మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల ప్రజలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారని పోలీసులు చెప్పారు. అక్కడ గొడవకు దిగిన వారిని చెదరగొట్టారు.