: జగన్ చేస్తోన్న వ్యాఖ్యలపై మరోసారి ఫిర్యాదు చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉరిశిక్ష వేసినా తప్పులేదంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఇటీవల జగన్ తాను చేసిన వ్యాఖ్యలపై ఈసీకి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోసారి జగన్ అటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఉద్దేశ పూర్వకంగానే తరచూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారిని కోరినట్లు కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు.