: చంద్రబాబుపై జగన్ చేస్తోన్న వ్యాఖ్యలపై టీడీపీ వినూత్న నిరసన!
‘కాల్చి పారేయాలి, ఉరితీసినా తప్పులేదు’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న తీవ్ర వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు జగన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జగన్ వేషధారణ వేసిన ఓ వ్యక్తి చేతికి తుపాకీ ఇచ్చి పరుగులు తీయించారు. ఆ వ్యక్తిపై కోడిగుడ్లు, టమోటాలు విసిరేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తోన్నముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని అన్నారు.