: ఉప రాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలపై వెంకయ్య నాయుడు ఆగ్రహం
ఈ రోజు రాజ్యసభ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యల పట్ల నూతన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు భగ్గుమన్నారు. అన్సారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలని విమర్శించారు. ఆయన అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అన్సారీ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ.. అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటని అన్నారు. ఆయన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు. ఆయన ఈ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగానే చేశారా? అనే అంశం గురించి తాను ఏమీ చెప్పలేనని వ్యాఖ్యానించారు.