: జగన్, రోజా మాట్లాడుతున్న భాషే నంద్యాలలో మమ్మల్ని గెలిపిస్తుంది: సోమిరెడ్డి
నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై తమ పార్టీ అభ్యర్థి విజయం తథ్యమని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. జగన్, రోజా మాట్లాడుతున్న భాషే తమని గెలిపిస్తుందని ఎద్దేవా చేశారు. నంద్యాలలో మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ నాయకత్వం నచ్చకనే వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురు నేతలు వచ్చారని అన్నారు. భూమా నాగిరెడ్డి కూడా అందుకే వచ్చేశారని అన్నారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని అన్నారు. అందుకే అవినీతి అంటూ టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.