: కార్తీ చిదంబరం `లుకౌట్` నోటీసుపై స్టే విధించిన మద్రాసు హైకోర్టు
అవినీతి కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంతో పాటు మరో నలుగురిపై సీబీఐ జారీ చేసిన లుకౌట్ నోటీసుపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. ఫెమా నిబంధనలను అతిక్రమించినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐలు కార్తీ చిదంబరంకు లుకౌట్ నోటీసులు జారీ చేశాయి. ఈ విషయంలో కార్తీకి రెండు సార్లు నోటీసులు పంపినా ఆయన సీబీఐ వారికి సహకరించలేదు. ఎప్పటికప్పుడు ఆయన విచారణ కోసం గడువు కోరుతూ వచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియా కంపెనీ మాధ్యమంగా తన కంపెనీలో తానే అక్రమ పెట్టుబడులు పెట్టి కార్తీ అవినీతికి పాల్పడినట్లు సీబీఐ ఆరోపించింది.