: మహేశ్ బాబు ‘స్పైడర్’ టీజర్ కు అప్పుడే కోటి వ్యూస్!
మహేశ్ బాబు నటిస్తోన్న స్పైడర్ సినిమా టీజర్ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతోంది. నిన్న మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్‌ను సామాజిక మాధ్యమాల్లో పలువురు సినీ ప్రముఖులు కూడా షేర్ చేశారు. ఈ టీజర్ అప్పుడే 10 మిలియన్ల (కోటి) డిజిటల్ వ్యూస్ సాధించింది. మహేశ్‌బాబు స్టైల్, డైలాగ్‌లకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కొత్త కథాంశంతో, మంచి సందేశాన్నిచ్చే విధంగా దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్ బాబు చేస్తోన్న పనుల్ని కనిపెట్టే జర్నలిస్ట్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.