: సమంత కన్నా అందమైన, గొప్ప అమ్మాయి లేదు: నాగచైతన్య
తనకు కాబోయే భార్య సమంత ప్రపంచంలోనే అందరికన్నా అందమైన అమ్మాయి అని చెప్పాడు హీరో నాగచైతన్య. సమంత అనగానే తనకు మొదట గుర్తుకొచ్చేది ప్రపంచంలోనే ఓ గొప్ప మనిషి అని చెప్పాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు చై స్పందించాడు. తనపై కోపమొస్తే సమంత సీరియస్ గా చూస్తుందని... పోట్లాడటం మాత్రం ఉండదని చెప్పాడు. నిశ్చితార్థం తర్వాత మా ఇద్దరిలో ఎలాంటి మార్పులు రాలేదని, ఇంతకు ముందులానే ఇప్పుడు కూడా ఉన్నామని తెలిపాడు. తన లవ్ స్టోరీని ఎవరైనా సినిమా తీయాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు.