: నంద్యాలలో ఇప్పటివరకు రూ.11 లక్షలు సీజ్.. వ్యక్తిగత విమర్శలు చేయకూడదు: భన్వర్ లాల్
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ.11 లక్షల వరకు నగదు స్వాధీనం చేసుకున్నామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగకూడదని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికకు 250 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. నంద్యాలలో మొత్తం 2, 19, 108 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి లైవ్ వెబ్‌కాస్టింగ్ ఉంటుందని చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వీడియోగ్రఫీ చేస్తామని తెలిపారు.