: అయేషామీరా హత్యకేసులో పునర్విచారణకు సిట్ ఏర్పాటు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన ఆయేషామీరా హత్యాచారం కేసులో సత్యం బాబును కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దోషులెవరనే అంశాన్ని తేల్చేందుకు ఈ కేసులో పునర్విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించనుంది. ఇందులో సభ్యులుగా డీఎస్పీలు హైమావతి, శ్రీలక్ష్మి, సీఐ షెహెరున్నీసాబేగం ఉన్నారు. ఈ కేసులో పునర్విచారణ జరిపి ఈ బృందం డీజీపీకి నివేదిక సమర్పించనుంది. ఈ టీమ్ వివరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు హైకోర్టుకు నివేదించింది.