: పిజ్జా ట్రక్కుకు యాక్సిడెంట్.... రోడ్డంతా పిజ్జాలే!
18 చక్రాల పిజ్జా డెలివరీ ట్రక్కు అదుపు తప్పడంతో అందులో ఉన్న పిజ్జాలన్నీ హైవే మీద చెల్లాచెదురుగా పడ్డాయి. అమెరికాలోని అర్కాన్సాస్ హైవే మీద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు కానీ రోడ్డు మీద పడిన పిజ్జాలను తొలగించడం కోసం నాలుగు గంటల పాటు ఆ హైవేను మూసివేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రోడ్డు మీద ఉన్న పిజ్జాలను అర్కాన్సాస్ ట్రాఫిక్ సిబ్బంది, ఇతర పోలీసులు అధికారులు వీలైనన్ని తమ ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.