: అన్న బాటలోనే తమ్ముడు... రూ. 299తో అన్ లిమిటెడ్ డేటా, కాల్స్ ఆఫర్ చేసిన అనిల్ అంబానీ
మార్కెట్లోకి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ జియోను ప్రవేశపెట్టి, చౌక ధరలతో కూడిన ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చిన తరువాత తమ కస్టమర్లను పోగొట్టుకోకుండా ఉండేందుకు మిగతా టెలికం సంస్థలు నానా పాట్లూ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సోదరుడు అనిల్ అంబానీ కూడా అదే దారిలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఆర్ కామ్ ఓ వినూత్న ఆఫర్ ను ప్రవేశపెట్టింది. సంస్థ అధికారిక ట్వీట్ ప్రకారం, రూ. 299 రెంటల్ ప్లాన్ తో లభించే పథకం కింద అపరిమిత డేటా, కాల్స్, టెక్ట్స్ మెసేజ్ లను వినియోగదారులకు అందిస్తామని తెలిపింది. ఈ ప్లాన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న మరిన్ని వివరాలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు.