: రూ. 25.5 కోట్ల‌కు అమ్ముడైన‌ `బాహుబ‌లి` చిత్రాల ఆన్‌లైన్‌ ప్ర‌సార‌హ‌క్కులు... నెట్‌ఫ్లిక్స్‌లో ప్ర‌సారానికి సిద్ధం!


ఆన్‌లైన్ వీడియో ఆన్‌ డిమాండ్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్ నెట్‌ఫ్లిక్స్ రూ. 25.5 కోట్ల‌కు బాహుబ‌లి 1, 2 చిత్రాల ఆన్‌లైన్ ప్ర‌సార హ‌క్కుల‌ను చేజిక్కించుకుంది. దీంతో బాహుబ‌లి చిత్రాల‌ను 192 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ ద్వారా వీక్షించే స‌దుపాయం క‌లిగింది. భార‌త‌దేశంలో త‌మ స్ట్రీమింగ్ స‌ర్వీస్‌ల‌ను అభివృద్ధి చేసే ఉద్దేశంతో నెట్‌ఫ్లిక్స్ ప్రాంతీయ భాషా చిత్రాల‌పై కన్నేసింది.

అంతేకాకుండా త‌మ బ్రాండ్ త‌ర‌ఫున అత్యుత్త‌మ నిర్మాణ విలువ‌ల‌తో వెబ్ సిరీస్‌ల‌ను కూడా లాంచ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇప్ప‌టికే సైఫ్ అలీ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో `సేక్రెడ్ గేమ్స్‌` పేరుతో ఓ వెబ్‌సిరీస్ షూటింగ్ కూడా ప్రారంభించింది. అలాగే అర‌వింద్ అడిగా పుస్త‌కం ఆధారంగా `సెల‌క్ష‌న్ డే`తో పాటు `అగైన్‌` అనే మ‌రో వెబ్‌సిరీస్‌ను కూడా నెట్‌ఫ్లిక్స్ తీసుకురాబోతుంది. నెట్‌ఫ్లిక్స్‌కు పోటీగా ఉన్న స్ట్రీమింగ్ స‌ర్వీస్ వెబ్‌సైట్లు `హాట్‌స్టార్‌`, `అమెజాన్ ప్రైమ్‌`లు కూడా వెబ్‌సిరీస్‌ల నిర్మాణంపై దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News