: శిల్పా సోదరులు ప్రజాసేవ చేయరు... డబ్బు రాజకీయాలు చేస్తారు!: టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి


నంద్యాల ఉప ఎన్నికలో శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అబాండం తండాలో ఆయన ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా వైసీపీకి చెందిన 60 మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం రాజకీయ స్వార్థంతోనే శిల్పా సోదరులు వైసీపీలోకి వెళ్లారని విమర్శించారు. శిల్పా సోదరులు ప్రజాసేవ చేయరని... డబ్బు రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. శిల్పా హయాంలో నంద్యాల నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ఒక్క గ్రామంలో కూడా ఆయన అభివృద్ధి పనులను చేపట్టలేదని చెప్పారు. అలాంటి శిల్పా మోహన్ రెడ్డికి ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

  • Loading...

More Telugu News