: నంద్యాల నియోజకవర్గంలో టీడీపీలో చేరిన 200 మంది వైసీపీ కార్యకర్తలు!


నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో రోజురోజుకూ నియోజకవర్గంలోని రాజకీయ ముఖచిత్రం మారిపోతోంది. తాజాగా కానాలపల్లె గ్రామానికి చెందిన 200 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆమంచి కృష్ణ మోహన్ ల సమక్షంలో వీరు పసుపు కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ శిల్పా మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. నియోజకవర్గం అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోని శిల్పా మోహన్ రెడ్డి... ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుక్కోవడానికి వస్తున్నాడని ఆయన ప్రశ్నించారు. దివంగత భూమా నాగిరెడ్డి ప్రతిపాదించిన పనులన్నింటినీ పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. టీడీపీపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. 

  • Loading...

More Telugu News