: వర్ణికా కుందుకు బాలీవుడ్ హీరోయిన్ మద్దతు!
హర్యాణాలో వేధింపులకు గురైన ఐఏఎస్ అధికారి కుమార్తె వర్ణికా కుందుకు బాలీవుడ్ హీరోయిన్ నేహా ధూపియా మద్దతు పలికింది. ఒక టీవీ ఛానెల్ లో 'నో ఫిల్టర్ నేహా' అనే టాక్ షో నిర్వహిస్తున్న నేహా ధూపియా నిన్నటి ఎపిసోడ్ లో వర్ణికా కుందును అభినందించింది. ఆమె పోరాట పటిమ ఇతర మహిళల్లో స్పూర్తి నింపుతుందని చెప్పింది. ఏమాత్రం అధైర్యపడకుండా ఆమె ఘటనను ఎదుర్కొన్న తీరు అద్భుతమని అభినందించింది. అమ్మాయి అయినంతమాత్రాన నోరు మూసుకుని ఉండాలా? అని ప్రశ్నించింది. ఆమెను చూసి మహిళలంతా నోరు విప్పే ధైర్యం చేస్తారని ఆమె అభిప్రాయపడింది. వర్ణికా కుందును వేధించిన ఘటనలో వికాశ్ బరాలా అరెస్టైన్ సంగతి తెలిసిందే. ఈ కేసు రుజువైతే అతనికి ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.