: నాగచైతన్య, సమంతల పెళ్లి కార్డు ఇదేనా?
అక్కినేని నాగచైతన్య, సమంతల పెళ్లి అక్టోబర్‌లో గోవాలో మూడు రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పెళ్లి పత్రిక ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ, రామానాయుడు, రాజేశ్వరి జంటల ఆశీస్సులతో నాగచైతన్య, సమంతలు అక్టోబర్ 6న ఒక్కటి కానున్నారని ఈ ఆహ్వాన పత్రికలో ఉంది. అలాగే గోవాలో వీరి పెళ్లి జరగబోయే వేదిక చిరునామా కూడా ఈ పెళ్లి పత్రికలో ఉంది. ఇది అబ్బాయి తరఫు పెళ్లి పత్రిక కావడంతో నాగార్జున, అమల పేర్లతో పాటు నాగచైతన్య తల్లి లక్ష్మి, ఆమె భర్త శరత్ పేర్లను కూడా పత్రికపై ప్రచురించారు.