: జగన్ ప్రచారంతో టీడీపీకే లాభం: కాల్వ శ్రీనివాసులు


నంద్యాల ఉప ఎన్నిక ప్రచారపర్వం వాడీవేడిగా కొనసాగుతోంది. వైసీీపీ అధినేత జగన్ కూడా ప్రచారపర్వంలోకి దిగడంతో, రాజకీయ వాతావరణం వేడెక్కింది. నిన్న రోడ్ షోను చేపట్టిన జగన్... తనదైన శైలిలో అధికారపక్షంపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో, టీడీపీ నేత, మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ఓ ఉన్మాదిలా జగన్ చేస్తున్న ప్రచారం టీడీపీకే మేలు చేస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ప్రచారం, ఓ విజయయాత్రలా సాగుతోందని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యకమాల వల్ల నంద్యాల ఓటర్లు టీడీపీకే ఓటు వేస్తారని తెలిపారు. 

  • Loading...

More Telugu News