: అమెరికాపై వేసే క్షిపణి పేరును వెల్లడించిన ఉత్తర కొరియా!
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య కోటలు దాటుతున్న మాటల యుద్ధం మరింత తీవ్ర స్థాయికి చేరిన వేళ, గువాం ద్వీపంపై తాము వేయాలని భావిస్తున్న క్షిపణి గురించిన వివరాలను ఉత్తర కొరియా వెల్లడించింది. బాలిస్టిక్ క్షిపణి హ్వాసంగ్ -12ను ఆ దేశంపై ప్రయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికార మీడియా కేసీఎన్ఏ (కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ) వెల్లడించింది. ట్రంప్ హెచ్చరికలను సైతం ఖాతరు చేయకుండా ప్రతి హెచ్చరికలు చేసేందుకు ముందుకురుకుతున్న ఉత్తర కొరియా వైఖరి, గతంలో కన్నా ఇప్పుడు తీవ్రంగా ఉందని పలు దేశాలు భయపడుతున్నాయి. ఈ రెండు దేశాలనూ కాస్తంత సంయమనం పాటించాలని చైనా, జర్మనీలు సూచించాయి.