: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నివసించిన ఇంట్లో వుండాలని అనుకుంటున్నారా? అయితే, ఆ చాన్స్ ఇప్పుడు మీకోసం!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లా కనీసం ఒకరోజైనా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడా అవకాశం మీ ముంగిట్లో ఉంది. న్యూయార్క్ నగరంలో ట్రంప్ చిన్నప్పుడు నివసించిన ఇల్లు ఇప్పుడు ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్, సేవల సంస్థ ఎయిర్‌బిఎన్‌బీలో లిస్టయింది.

క్వీన్స్‌లో ఉన్న ఈ ఇల్లు 1940 నాటిది. ట్యూడర్ శైలిలో దీనిని నిర్మించారు. ఇందులో ఐదు పడక గదులు ఉన్నాయి. 20 మంది వరకు నిద్రపోవచ్చు. ఇప్పుడీ ఇంట్లో గడిపే అవకాశం అందరికీ అందుబాటులోకి వచ్చింది. 725 డాలర్లు చెల్లించి ఈ ఇంట్లో ఒక రాత్రి గడపొచ్చు. అయితే స్మోకింగ్, పార్టీలు వంటి వాటిని అనుమతించరు. మార్చిలో ఈ ఇంటిని పారామౌంట్ వేలం వేయగా గుర్తు తెలియని వ్యక్తి ఒకరు 2.14 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News