: ‘టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా’ పోస్టర్‌పైనే మూత్రవిసర్జన చేసిన యువకుడు.. ఫొటో వైరల్.. హోరెత్తిపోతున్న ట్విట్టర్!
టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంట్లో టాయిలెట్ లేదన్న కారణంతో భర్తను వదలి వెళ్లిపోయిన భార్యకు సంబంధించిన మూల కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది. సామాజిక జాడ్యంలా మారిన బహిరంగ మల, మూత్ర విసర్జనను విడనాడాలని చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. అయితే తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
గోడకు అంటించిన టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా సినిమా పోస్టర్‌పైనే ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న ఫొటోను ఎవరో సోషల్ మీడియాలో పోస్టు చేయడం ట్విట్టర్ లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఫొటోపై కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘అతడి టాయిలెట్ అక్షయ్ కుమార్ సినిమా కంటే ముందే విడుదలైందని కొందరంటే, ఇంతకంటే గొప్పగా ఊహించలేమని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన చేయవద్దు, టాయిలెట్ ఉన్న దగ్గరే ఆ పని చేయండి.. అని అక్షయ్ అన్నట్టు, మీ ఇష్ట ప్రకారమే అంటూ.. ప్రజలు పోస్టర్ దగ్గరే ఆ పని చేస్తున్నట్టు మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ సినిమాకు ప్రాక్టికల్ ప్రమోషన్ ఇస్తున్నారని ఇంకొకరు, అక్షయ్ సినిమాకు ఇంతకుమించిన రివ్య్యూ మరొకటి ఉండదని వేరొకరు.. ఇలా కామెంట్లతో ట్విట్టర్ హోరెత్తిపోతోంది.