: డోక్లాంలో ఇంకా 53 మంది భారత సైనికులు ఉన్నారు.. జవాన్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న డ్రాగన్ కంట్రీ!


తమకు చెందిన డోక్లాం ప్రాంతంలో 53 మంది ఇండియన్ ఆర్మీ జవానులతో పాటు, ఓ బుల్డోజర్ మోహరించి ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఆ దేశ అధికారిక దినపత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ పేర్కొంది. తమ భూభాగమైన డోక్లాం నుంచి భారత్ వెంటనే తమ బలగాలను ఉపసంహరించుకోవాలని మంత్రిత్వశాఖ కోరినట్టు తెలిపింది. కాగా, ఆగస్టు 2న చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ డోక్లాం సరిహద్దులో 48 మంది భారత సైనికులు, ఒక బుల్డోజర్ ఉన్నట్టు పేర్కొన్నారు. అంతేకాక సరిహద్దుకు సమీపంలో పెద్దఎత్తున భారత బలగాలు మోహరించి ఉన్నాయని ఆరోపించారు. తాజాగా ఆ సంఖ్యను చైనా 53కు పెంచేసింది.

కాగా, సిక్కిం సరిహద్దులో గత 50 రోజులుగా భారత్-చైనా సైనికుల స్టాండాఫ్ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో చైనా రోడ్డు నిర్మాణానికి సిద్ధం కావడంతో భారత్ అడ్డుకుంది. ఇది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. అప్పటి నుంచి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అక్కడి పత్రికలు రోజుకో కథనంతో భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాగా తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, మిలటరీ ఆపరేషన్ తప్పదని పేర్కొన్నాయి. తాజా ఉద్రిక్తతలపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందిస్తూ ఇరు దేశాలు తమ బలగాలను వెనక్కి పిలిపిస్తేనే చర్చలు జరుగుతాయని, లేదంటే లేదని తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News