: 1962 ఇండో-చైనా యుద్ధంలో భారత్ ఘన విజయం.. మధ్యప్రదేశ్ పాఠ్యపుస్తకాలు చెబుతున్నది ఇదే!


అవును! 1962లో భారత్-చైనా మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించిందట. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్‌లోని సీబీఎస్‌సీ అనుబంధ స్కూళ్లలోని 8వ తరగతి సంస్కృత పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు చెబుతున్నాయి. లక్నోకు చెందిన కృతి ప్రకాశన్ ప్రైవేట్ లిమిటెడ్ ముద్రించిన ఈ పుస్తకాల్లోని పాఠ్యాంశాలను ప్రముఖ రచయితలు రాశారు. వీరిలో ఇటీవల మృతి చెందిన ప్రముఖ ప్రొఫెసర్ ఉమేశ్ ప్రసాద్ రస్తోగి,  గ్రామర్ నిపుణుడు సోమ్‌దత్ శుక్లా కూడా ఉన్నారు.

 భారత్ పై దురాక్రమణకు ప్రయత్నించిన చైనాకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తగిన బుద్ధి చెప్పారని ఓ పాఠంలో పేర్కొన్నారు. ఈ యుద్ధంలో భారత్ అపూర్వ విజయం సాధించిందని పేర్కొన్నారు. ఈ పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశంపై స్పందించేందుకు లక్నో యూనివర్సిటీ సాంస్కృతిక విభాగ ముఖ్య అధికారి రామ్ సుమీర్ యాదవ్ నిరాకరించారు. కాగా, విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చరిత్రను వక్రీకరించి పాఠాలు బోధించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News