: బీబీసీ చానెల్ పరువు తీసిన ఉద్యోగి... సోషల్ మీడియాలో విమర్శల దుమారం!


ప్రపంచ మీడియాలో బీబీసీకి ప్రత్యేక స్థానం ఉంది. బీబీసీలో ఒక కథనం ప్రసారమైందంటే అది చాలా కీలకమైన అంశమని చాలా మంది భావిస్తుంటారు. అలాంటి బీబీసీ ఛానెల్ పరువును ఒక ఉద్యోగి తీసేశాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... బీబీసీ ఛానల్‌ లో సోమవారం అర్ధరాత్రి యాంకర్‌ వార్తలు చదువుతున్న సమయంలో బ్యాక్ గ్రౌండ్ లో న్యూస్ రూం కనిపించింది. ఈ సమయంలో ఎడిటింగ్ రూంలో కూర్చున్న ఉద్యోగి ఒకరు కంప్యూటర్ కు హెడ్ సెట్ పెట్టుకుని, అందులో అశ్లీల వీడియోలు చూస్తూ కనిపించాడు.

దీనిని గమనించిన ఒక వీక్షకుడు ఆ వెంటనే దానిని రికార్డు చేశాడు. పదిసెకెన్ల నిడివిగల చిత్రాన్ని తన ఫేస్ బుక్ లో 'ఏవండోయ్, ఇది చూశారా?' అంటూ ఆ వీడియోను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్ అయింది. బీబీసీలో ఇలాంటి ఘటనను తాను నమ్మలేకపోయానని, అయితే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తరువాతే దీనిని నమ్మాల్సి వచ్చిందని తెలిపాడు. దీనిపై బీబీసీ విచారణకు ఆదేశించింది. నిజానిజాలు తెలుసుకుంటున్నామని, తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామని బీబీసీ ప్రతినిధులు తెలిపారు. 

  • Loading...

More Telugu News