: సీబీఐతో మమ్మల్ని భయపెట్టలేరు.. ఐక్య పోరాటం చేస్తాం!: మమతా బెనర్జీ
సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను ఉపయోగించి తమను భయపెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే తాము వాటికి భయపడే రకం కాదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ‘బీజేపీ క్విట్ ఇండియా’ నినాదంతోనే ముందుకు వెళ్తామన్నారు. దేశాన్ని విభజించాలని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తాము అడ్డుకుంటామన్నారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి మతతత్వ, విద్వేష రాజకీయాలపై ఐక్యపోరాటం చేస్తామన్నారు. అధికారం నుంచి బీజేపీ తప్పుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.