: శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన అమిత్ షా!
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. గుజరాత్ రాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న ఆయన నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టిన తరువాత పార్టీ పగ్గాలు అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ నిలదొక్కుకునేందుకు ప్రణాళికలు రచించి, విజయవంతంగా అమలు చేశారు. తాజాగా గుజరాత్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి అమిత్ షా రాజీనామా చేశారు. కాగా, ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయిన నేపథ్యంలో ఆయన స్థానాన్ని అమిత్ షాతో భర్తీ చేయనున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి.