: జగన్ పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు: మంత్రి దేవినేని ఉమా
ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసీకి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ కనీసం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం ఆయన అహంభావాన్ని సూచిస్తోందని అన్నారు. జగన్ తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఈసీకి వివరణ ఇచ్చారని అన్నారు.
రాష్ట్రంలోని రైతులు, డ్వాక్రా మహిళలకు చంద్రబాబు రుణమాఫీ చేయలేదని, ఆ కారణంగానే అసహనానికి గురై అటువంటి వ్యాఖ్యలు చేశానని జగన్ ఈసీకి చెప్పారని ఆయన అన్నారు. జగన్‌లో పశ్చాత్తాపం కనిపించలేదని, దీనిపై ఈసీ స్పందించాలని అన్నారు. జగన్ ఇచ్చిన వివరణపై చర్యలు తీసుకోవాలని అన్నారు.