: బస్సులో పెద్దాయన కొంటెపని.. రెండేళ్ల జైలు శిక్ష!
బస్సులో ఓ వ్యక్తి చేసిన కొంటెపని ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడానికి కారణమైంది. ఈ ఘటన సింగపూర్‌లో చోటు చేసుకుంది. ఓ బస్సు ఎక్కిన 60 ఏళ్ల ఓ వ్యక్తి ఓ సీటుపై ‘టూత్‌పిక్స్’ను గుచ్చి వెళ్లిపోయాడు. ఒక వేళ ఆ సీట్లో ప్రయాణికులు ఎవరయినా కూర్చుంటే అవి వారికి గుచ్చుకునే ప్రమాదం ఉంది. దీంతో బస్సు సర్వీసులు అందించే రవాణా సంస్థ పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేసింది.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి, అరెస్టు చేశారు. అతడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. ఇంత చిన్న విషయానికి సింగపూర్‌లో ఇంత పెద్ద శిక్ష పడడంతో ఈ ఘటన అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. శిక్షలు కఠినంగా ఉండడంతో సింగపూర్ లో నేరాల రేటు అత్యల్పంగా ఉంటుంది.