: లావుగా ఉన్నాడని నా కుమారుడిని తిడతారా?: కేటీఆర్
రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా? అని ఒక్కోసారి బాధేస్తుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. చివరకు తన కుటుంబాన్ని కూడా వదలడం లేదని... లావుగా ఉన్నాడని తన కుమారుడిని తిట్టడం బాధాకరమని చెప్పారు. తన కంటే కేసీఆర్, హరీష్ రావులే ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. కనీసం ఆదివారమైనా రెస్ట్ తీసుకోవాలని హరీష్ ను కోరానని చెప్పారు. అందరికంటే ఎక్కువగా హరీషే తన నియోజకవర్గానికి వెళుతుంటారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 50 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు.